కృష్ణా జిల్లాను రెడ్, ఆరెంజ్, గ్రీన్‌జోన్లుగా విభజిస్తూ కలెక్టర్ ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. రెడ్‌జోన్‌లో పెనమలూరు, విజయవాడ రూరల్, సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, విజయవాడ సిటీ, మచిలీపట్నం కార్పొరేషన్, జగ్గయ్యపేట, నూజివీడు మండలాలు ఉన్నాయి. గుడివాడ, పెడన, కొండపల్లి మున్సిపాలిటీలూ రెడ్ జోన్లో ఉన్నాయి. తిరువూరు, ఉయ్యూరు, నందిగామ నగర పంచాయతీలను రెడ్‌జోన్‌లో చేర్చారు. ఆరంజ్‌జోన్‌లో గన్నవరం, ముసునూరు, కంకిపాడు, జగ్గయ్యపేట రూరల్ మండలాలు ఉన్నాయి. కలెక్టర్ ఇంతియాజ్ మిగిలిన 43 మండలాలు గ్రీన్‌జోన్లుగా ప్రకటించారు.
కృష్ణా జిల్లాలో రెడ్, ఆరెంజ్, గ్రీన్‌జోన్లు ఇవే.. - zone division in krishna district
కృష్ణా జిల్లాను జోన్ల విభజిస్తూ కలెక్టర్ ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. రెడి, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించారు.
లాక్ డౌన్ పై కలెక్టర్ ఇంతియాజ్