ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దేవుడి సొమ్ముకు ఆశపడేవాళ్లం కాదు: వైవీ సుబ్బారెడ్డి - తిరుమల ఆస్తులపై వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్

తితిదే ఆస్తుల విక్రయ నిర్ణయంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. స్వామివారి వద్ద తాము సేవకులుగా మాత్రమే ఉన్నామన్నారు. తమపై ఎలాంటి నిందలు వేసినా తట్టుకునే ధైర్యం స్వామే ఇస్తాడని సుబ్బారెడ్డి అన్నారు.

yv subba reddy on sale of ttd assets
yv subba reddy on sale of ttd assets

By

Published : May 25, 2020, 6:27 PM IST

Updated : May 25, 2020, 8:56 PM IST

దేవుడి సొమ్ముకు ఆశపడేవాళ్లం కాదు: వైవీ సుబ్బారెడ్డి

శ్రీవారి విషయంలో ఎలాంటి పుకార్లు ప్రచారం చేయవద్దని వైవీ సుబ్బారెడ్డి కోరారు. తితిదే భూములు అమ్మాలంటే కేవలం కోటీ 53 లక్షల విలువైన భూములే అమ్ముతామా ?అని ప్రశ్నించారు. రాజకీయ వ్యతిరేకతతోనే మాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిరుపయోగంగా ఉన్న ఆస్తులనే గుర్తించి వేలం వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఎన్నో విలువైన భూములను అమ్మేసిందని ఆరోపించారు. పదవిలో ఉన్నా.. లేకున్నా.. దేవుడి సొమ్ము ఆశించే ప్రసక్తే లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇంద్రకీలాద్రి, సింహాచలం భూములు అన్యాక్రాంతమయ్యాయని సుబ్బారెడ్డి అన్నారు.

గత ప్రభుత్వం హయంలోనే..

తితిదేకి భక్తులు ఇచ్చే ప్రతి రూపాయి బాధ్యతగా ఖర్చు చేస్తామని... తిరుపతిలో గరుడ వారధికి గత ప్రభుత్వం తితిదే నిధులు ఖర్చు చేసిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తితిదేలో అన్యాక్రాంతమైన, నిరుపయోగంగా ఉన్న ఆస్తుల అమ్మకం కొత్తేం కాదని పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వ హయాంలోనే భూముల అమ్మకం ప్రతిపాదన జరిగిందని గుర్తు చేశారు.

కన్నా, ఐవైఆర్ వాస్తవాలు తెలుసుకోవాలి

కన్నా, ఐవైఆర్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదని సుబ్బారెడ్డి అన్నారు. గత పాలకమండలి భూముల అమ్మకం తీర్మానంలో భాజపా, తెదేపా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తమిళనాడులో నిరూపయోగంగా ఉన్న స్థలాలనే వేలానికి పెట్టినట్లు.. పొరుగు రాష్ట్రంలో పలుచోట్ల ఉన్న 1, 2 సెంట్ల భూమిని కాపాడటం కష్టంగా ఉందని చెప్పారు. ఆ స్థలాలు అన్యాక్రాంతమైతే కానుకలు ఇచ్చిన వారి మనోభావాలు దెబ్బతింటాయన్నారు.

పింక్ డైమండ్

ఆస్తుల వేలంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని.. నిరుపయోగమైన ఆస్తుల వేలంపై పునరాలోచన చేస్తామని సుబ్బారెడ్డి అన్నారు. పింక్‌ డైమండ్‌ గల్లంతుపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఆస్తుల వేలంపై రోడ్ మ్యాప్ తయారుచేయాలని మాత్రమే చెప్పామన్నారు.

Last Updated : May 25, 2020, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details