నిరుద్యోగులు చనిపోతే కాని తెలంగాణ సీఎం కేసీఆర్ (Cm Kcr)కు కర్తవ్యం గుర్తుకు రాలేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ట్విట్టర్ వేదికగా అన్నారు. యువత ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటే కానీ... కేసీఆర్ దొరకు ఉద్యోగాలు ఇవ్వాలనే సోయి రాలేదన్నారు. నిరుద్యోగులు చనిపోతూ ఉంటే చావకండి అని ఒక్క మాట చెప్పని కేసీఆర్... ఈరోజు జోనల్ సిస్టమ్ వల్లే ఆలస్యమైందని చెప్పడం ఆశ్చర్యం కల్గిస్తుందన్నారు.
ఈరోజు కేసీఆర్ దొర కళ్లు తెరిపించింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని వ్యాఖ్యానించారు. పార్టీ పెట్టకముందే తాము నిరుద్యోగుల కోసం దీక్ష చేయడం వల్లే కేసీఆర్ సారు దిగొచ్చి ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని మాట్లాడుతున్నారన్నారు.