సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థ, హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ విచారణ ముమ్మరం చేసింది. అందులో భాగంగా వైకాపా సోషల్ మీడియా ఇంఛార్జ్ దేవేందర్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 నుంచి రాత్రి 9గంటల వరకు అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. సీబీఐ విచారణకు పూర్తిగా సహకరించానని విచారణ అనంతరం దేవేందర్‌రెడ్డి తెలిపారు. ఇదే సమయంలో సీఎం జగన్‌పై పెట్టిన పోస్టులపై కేసులు ఉండవా? అని దేవేందర్‌రెడ్డి ప్రశ్నించాడు.
ఉదయం ఎమ్మెల్యే జోగి రమేశ్, వైకాపా సోషల్ మీడియా బృందం విచారణ జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. భారీగా కార్యకర్తలు చేరుకోవడంతో ఏసీపీ షాను నేతృత్వంలో పోలీసులు అక్కడ పరిస్థితిని పర్యవేక్షించారు.