ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MP Vijaya Sai On Budget: కేంద్ర ఆర్థికశాఖ ఫార్ములాతో ఏపీకి అన్యాయం: ఎంపీ విజయసాయి - కేంద్ర బడ్డెట్​పై విజయసాయి కామెంట్స్

Vijaya Sai On Central Budget: కేంద్రం బడ్జెట్‌పై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. కేంద్ర ఆర్థికశాఖ ఫార్ములాతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. పన్నుల వాటాల్లో రాష్ట్రానికి వచ్చేది రూ.4 వేల కోట్లు మాత్రమేనన్నారు. అన్ని విషయాలు పరిశీలిస్తే ఇది నిరుత్సాహపరిచే బడ్జెట్‌ అని ఆయన అన్నారు.

కేంద్ర ఆర్థికశాఖ ఫార్ములాతో ఏపీకి అన్యాయం
కేంద్ర ఆర్థికశాఖ ఫార్ములాతో ఏపీకి అన్యాయం

By

Published : Feb 1, 2022, 5:31 PM IST

MP Vijaya Sai Reddy On Central Budget:కేంద్ర ఆర్థికశాఖ ఫార్ములాతో ఏపీకి అన్యాయం జరుగుతోందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అన్ని విషయాలు పరిశీలిస్తే కేంద్రం నిరుత్సాహపరిచే బడ్జెట్​ను ప్రవేశపెట్టిందన్నారు. భూమిలేని రైతులకు అండగా నిలిచేందుకు పథకం తేవాలని సూచించారు. కనీస మద్దతు ధరకు న్యాయపరమైన రక్షణ ఉండాలని అన్నారు. రొయ్యల ఉత్పత్తిపై పన్ను తగ్గింపును ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నదుల అనుసంధాన ప్రణాళికను సమర్థిస్తున్నామని.. నదుల అనుసంధానానికి పెట్టిన ఖర్చును రాష్ట్రానికి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

"ఈ ఏడాది ఆర్థికలోటు 6.4 శాతం ఉండొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల చెప్పారు. 2021లో ఏపీ ఆర్థికలోటు 5.38 శాతం. 2022లో ఏపీ ఆర్థికలోటు 3.49 శాతం. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి కేంద్ర, రాష్ట్టాలకు ఒక్కటే. కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటుతోంది. రాష్ట్రాలు మాత్రం ఎఫ్‌ఆర్‌బీఎం దాటకూడదని చెబుతోంది. ఎఫ్‌ఆర్‌బీఎంపై కేంద్రానివి ద్వంద్వ ప్రమాణాలు. పన్నుల వాటాల్లో ఏపీకి వచ్చేది రూ.4 వేల కోట్లు మాత్రమే. కేంద్ర ఆర్థికశాఖ ఫార్ములాతో ఏపీకి అన్యాయం"-విజయసాయిరెడ్డి, వైకాపా ఎంపీ

ABOUT THE AUTHOR

...view details