రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై వైకాపా ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని దీనిపై పార్టీలో చర్చించి సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై సీఎం జగన్ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని చెప్పారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీఎం తగు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. సీఎం నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని చెప్పారు.
ఇంకా సమయం ఉంది.. ఏ నిర్ణయమూ తీసుకోలేదు: ఎంపీ పిల్లి - రాష్ట్రపతి ఎన్నికలు తాజా వార్తలు
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై సీఎం జగన్ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని వైకాపా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఈ అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.., పార్టీలో చర్చించి సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారన్నారు.
ఎంపీ పిల్లి