ఏడాది పాలనలో బీసీల అభివృద్ధి కోసం సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని వైకాపా నేత పార్థసారథి అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నారన్నారు. ఏడాదిలో కోటి మందికి పైగా బీసీలకు సంక్షేమ పథకాల కోసం రూ.19,298 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. అధికారంలోకి రాగానే బీసీల సమస్యలు పరిష్కారం కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు సహా ప్రతి నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
బీసీలను తెదేపా మోసం చేసింది..
పేదల సొంతింటి కలను నెరవేర్చడం సహా ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెన, అమ్మఒడి కార్యక్రమాలు అమలు చేస్తూ.. సీఎం జగన్ బీసీల సమస్యలు పరిష్కరిస్తున్నారని పార్థసారథి తెలిపారు. ఆరోగ్యశ్రీ, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, నాయీబ్రాహ్మణులు, రజకులకు పదివేలు రూపాయలు ఇస్తున్నామన్నారు. తెదేపా హయాంలో బీసీలను అన్ని విధాలా మోసం చేశారని.. ఇప్పుడు ఎన్ని చెప్పినా చంద్రబాబును ఆయా వర్గాలు నమ్మవన్నారు. జగన్ను విమర్శించడమే లక్ష్యంగా మహానాడు ఏర్పాటు చేసుకున్నారని పార్థసారథి ఆక్షేపించారు.
ఇవీ చదవండి:
ప్రభుత్వం ఇకనైనా తీరు మార్చుకోవాలి: తెదేపా