వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 2 లక్షల 35 వేల 873 మంది లబ్ధిదారులకు సుమారు 354 కోట్ల రూపాయలను కాపు మహిళల బ్యాంకు ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారని వైకాపా ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. ఒక్కొక్కరికి ఏడాదికి 15 వేల చొప్పున ఐదేళ్లలో 75 వేల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు.
'కాపు నేస్తం'తో కాపుల్లో మరింత ధైర్యం వచ్చింది: జక్కంపూడి రాజా - వైఎస్సార్ కాపునేస్తంపై జక్కంపూడి రాజా కామెంట్స్
ప్రభుత్వం అమలు చేస్తోన్న వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా కాపుల్లో ధైర్యం వచ్చిందని వైకాపా ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. ఎన్నికల ముందు జగన్ చెప్పినవన్నీ నెరవేరుస్తున్నారని తెలిపారు.
ysrcp mla jakkampudi raja about ysr kapu nestham scheeme
ఎన్నికల ముందు కాపులకు చేస్తామని చెప్పినవన్నీ జగన్ నెరవేర్చుతున్నారని రాజా అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కాపు సంక్షేమ పథకాల కోసం 4 వేల 800 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత మేలు జరిగేలా వైకాపా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
ఇదీ చదవండి: 'వైఎస్ఆర్ కాపు నేస్తాన్ని' ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్