నిఘా యాప్ ఆవిష్కరణపై.. ఎన్నికల సంఘానికి వైకాపా వివరణ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాక ముందే సీఎం జగన్మోహన్ రెడ్డి నిఘా యాప్ను ప్రారంభించారని వైకాపా నేతలు ఈసీకి తెలిపారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను.. వైకాపా నేతలు ఎంవీఎస్ నాగిరెడ్డి, పార్టీ అధికారప్రతినిధి నారాయణ మూర్తి కలిశారు. నిఘా యాప్ పై చంద్రబాబు మాట్లాడిన తీరుపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు నాగిరెడ్డి తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఇలాంటి నిఘా పెంచాలని ప్రతిపక్షాలు కోరుతాయని... కానీ ప్రభుత్వమే నిఘా యాప్ తీసుకువచ్చినా ఫిర్యాదు చేయడం సరైంది కాదన్నారు. పల్నాడులో జరిగిన ఘటనపై ఈసీకి మరో ఫిర్యాదు చేసినట్లు వైకాపా నేతలు తెలిపారు. మాచర్లలో 144 సెక్షన్ అమలులో ఉన్నా .. తెదేపా నేతలు 10 కార్లతో ర్యాలీగా వెళ్లారని .. వేగంగా వాహనం నడిపి దివ్యాంగుడిని గాయపరిచారని తెలిపారు. ఆ తర్వాతే స్థానికుల ఆగ్రహానికి గురైనట్లు వివరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగనివ్వకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
నిఘా యాప్ ఆవిష్కరణపై.. ఈసీకి వైకాపా వివరణ
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 'నిఘా' యాప్ను ఆవిష్కరించడంపై తెదేపా నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంపై.. వైకాపా స్పందించింది. ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చింది.
తెదేపాపై ఈసీకి వైకాపా ఫిర్యాదు