స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఈ విషయంపై హైకోర్టుకు... అక్కడ కాకుంటే సుప్రీంకోర్టుకైనా వెళతామని స్పష్టం చేశారు. శనివారం చిత్తూరు జిల్లాలో నిర్వహించిన వైకాపా నవరత్నాల విజయోత్సవ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. కరోనా మహమ్మారి రాష్ట్రంలోకి ప్రవేశించక ముందు స్థానిక ఎన్నికలను రద్దు చేసి, ఇప్పుడు రెండో దఫా వైరస్ విజృంభిస్తుంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎన్నికల కమిషనర్ ప్రభుత్వ అభిప్రాయం తీసుకోకుండా ఇష్టానుసారంగా నోటిఫికేషన్ ఇవ్వడం చూస్తుంటే ఓ వ్యక్తికి సహాయం చేయబోయి.. రాష్ట్ర ప్రజలను ఇబ్బందుల్లో పడేస్తున్నట్టుగా ఉందని అన్నారు చెప్పారు. కేవలం చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చేందుకే పాకులాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే 95 శాతం స్థానాల్లో వైకాపా అభ్యర్థులు గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు లేవనే తాము చెబుతున్నామన్నారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేలా ఎస్‌ఈసీ వ్యవహరిస్తున్నారన్నారు.
ఎన్నికలకు భయపడటం లేదు: ధర్మాన
పంచాయతీ ఎన్నికలు రేపు నిర్వహించినా గెలుపు మాదే. రాష్ట్రంలో కరోనా వైరస్ అధికంగా ఉందని, టీకాలు వేసేందుకు సన్నద్ధమయ్యాం. ఎన్నికలకు భయపడి వద్దని అనడం లేదని, కరోనా నేపథ్యంలో ఎన్నికలు ఎందుకని ఆలోచిస్తున్నాం.
పండగపూట పేదలకు ఆనందం లేకుండా చేస్తున్నారు: బొత్స
ఈ నెల 11న అమ్మఒడి సాయం అందజేతకు ప్రభుత్వం సన్నద్ధమవుతుండగా పండగవేళ పేద ప్రజలకు ఆనందం, సంతోషం లేకుండా చేయటమే ధ్యేయంగా తెదేపా కుయుక్తులు పన్నింది. ఎన్నికల నెపంతో ఇళ్ల స్థలాలు, అమ్మఒడి సాయం వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవటానికి రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు కుట్రలు చేస్తున్నారు. ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనుకున్నా చంద్రబాబు, ఆయన తాబేదారులు కొందరు కోర్టులకు వెళ్లి అడ్డుతగిలారు.
ఏకపక్షంగా ఎన్నికల నోటిఫికేషన్: విశ్వరూప్
పంచాయతీ ఎన్నికల షెడ్యూలును ఎస్‌ఈసీ ఏకపక్షంగా ప్రకటించడంపై కోర్టుకెళతాం. రాష్ట్రంలో విగ్రహాలపై జరుగుతున్న దాడులు ప్రతిపక్షాల కుట్ర. ప్రధాని నరేంద్ర మోదీకి, సీఎం జగన్‌కు మధ్య చిచ్చు పెట్టడానికే ఇలాంటి సంఘటనలు చేయిస్తున్నారు.
చంద్రబాబు ప్రోద్బలంతోనే..: అప్పలరాజు