YSRCP leaders congratulates MLA's: ‘మంత్రి గారూ కంగ్రాచ్యులేషన్స్’ అంటూ మంగళవారం పలువురు వైకాపా ఎమ్మెల్యేలకు.. వారి సహచరులు సరదాగా శుభాకాంక్షలు తెలిపారు. వైకాపా శాసనసభాపక్ష సమావేశంలో మంత్రివర్గాన్ని అతి త్వరలో పునర్‌వ్యవస్థీకరిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. సమావేశం ముగిశాక.. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకునే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో.. ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, కొలుసు పార్థసారథి తదితరులకు వారి సహచర ఎమ్మెల్యేలు అభినందనలు తెలపడం అసెంబ్లీ లాబీల్లో కనిపించింది.
ఆ మూడు పార్టీలు కలుస్తాయా!