కృష్ణా నీటిని రెండు రాష్ట్రాలకు ఎలా పంపిణీ చేయాలనే విషయాన్ని ట్రైబ్యునల్ నిర్దేశించిందని.. దీనిప్రకారం శ్రీశైలంలో 800 లెవల్ వచ్చాక ఇద్దరూ నీటిని తీసుకోవచ్చని నిర్దిష్టంగా ఉందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ విషయంలో చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇలా చేయకపోతే రాయలసీమ అన్యాయం జరుగుతుందనే మాట ఎందుకు అనడం లేదన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం నిరర్థక ఆస్తులను .. గుర్తించి వాటిని వేలం వేయడానికి నిర్ణయం తీసుకుని తీర్మానం చేసిందని ఉమ్మారెడ్డి అన్నారు. ఆస్తులు అమ్మడానికి మూల పురుషుడు చంద్రబాబేనని సుబ్రహ్మణ్య స్వామి చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
'నీటి వివాదంపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు' - చంద్రబాబుపై ఉమ్మారెడ్డి కామెంట్స్
రాయలసీమ నీటివివాదంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నోరు విప్పాలని వైకాపా డిమాండ్ చేసింది. ఈ వివాదంపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని వైకాపా నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు.
ysrcp leader ummareddy comments on chandrababu