ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు భార్యనే.. దూషించిన వ్యక్తి వంశీ : వైకాపా నేత దుట్టా - దుట్టా రామచంద్రరావు వార్తలు

రాష్ట్రంలో మట్టి తవ్వకాలు, తరలింపులో దళారీ వ్యవస్థ దోపిడీ చేస్తోందని వైకాపా నేత దుట్టా రామచంద్రరావు అన్నారు. ఉచిత ఇసుక తరహాలోనే ఉచిత మట్టి విధానాన్ని అందుబాటులోకి తేవాలని కోరారు. తాను ఎమ్మెల్యే వంశీతో కలిసి పనిచేయబోనని దుట్టా రామచంద్రరావు మరోసారి స్పష్టం చేశారు.

దుట్టా రామచంద్రరావు
దుట్టా రామచంద్రరావు

By

Published : May 29, 2022, 7:07 PM IST

మట్టి తవ్వకాలు, తరలింపులో దళారీ వ్యవస్థ హవా నడుస్తోందని గన్నవరం వైకాపా నేత దుట్టా రామచంద్రరావు విమర్శించారు. జగనన్న కాలనీలు, భవనాలు, రహదారుల నిర్మాణం నేపథ్యంలో మట్టికి బాగా డిమాండ్ ఉందని.. ప్రభుత్వం నిర్దిష్ట విధానం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉచిత ఇసుక తరహాలోనే ఉచిత మట్టి విధానాన్ని అందుబాటులోకి తేవాలని కోరారు. తహసీల్దార్ కార్యాలయాలు సైతం దళారులతో కుమ్మక్కై మట్టి దందాలు చేస్తున్నాయని ఆరోపించారు.

తాను వంద శాతం వైకాపాలోనే ఉంటానని.. కానీ ఎమ్మెల్యే వంశీతో కలిసి పనిచేయబోనని దుట్టా రామచంద్రరావు స్పష్టం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డితో కూడా ఇదే విషయం చెప్పానన్నారు. 2024లో వంశీకే వైకాపా సీటు ఇస్తే ఓటు వేసి ఇంట్లో కూర్చుంటానన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు భార్యనే దూషించిన వ్యక్తి వంశీ అని ధ్వజమెత్తారు. కార్యకర్తల ఆవేదనను జగన్ దృష్టికి తీసుకువెళతానన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details