ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ ఉక్కుపై చంద్రబాబు లేఖ తెల్లకాగితం మీద సంతకమే: అంబటి - కేంద్రానికి చంద్రబాబు వార్తలు

విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దంటూ కేంద్రానికి చంద్రబాబు రాసిన.. లేఖ తెల్లకాగితం మీద సంతకమేనని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. లేఖలో కేంద్రాన్ని ప్రశ్నించలేదని ఆక్షేపించారు.

ambati on chandrababu letter to central governament
విశాఖ ఉక్కుపై కేంద్రానికి చంద్రబాబు లేఖ తెల్లకాగితం మీద సంతకమే : అంబటి

By

Published : Feb 21, 2021, 3:14 AM IST

విశాఖ ఉక్కుపై చంద్రబాబు రాసిన లేఖ తెల్ల కాగితం మీద సంతకం పెట్టిచ్చినట్టు ఉందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రెండున్నర పేజీల లేఖలో విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ.. జరిగిన ఉద్యమం గురించి రాశారు తప్ప మరో అంశం ప్రస్తావించలేదని విమర్శించారు.

విశాఖ నడిరోడ్డున చెప్పిన మాటల్లో ఏ ఒక్కదానిపైనా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారేమో అని చూశామని.. అవేమీ లేకుండానే లేఖ ఎలా రాశారని చంద్రబాబును అంబటి ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయటానికి వీల్లేదన్న ఒక్క వాక్యం కూడా అందులో లేకపోవడం శోచనీయమన్నారు.

ABOUT THE AUTHOR

...view details