ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP Govt On DA: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు - డీఏ విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు న్యూస్

Dearness Allowance: 2019 జూలై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం కరవు భత్యాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఏలో 10 శాతాన్ని ప్రాన్ ఖాతాలకు మిగతా 90 శాతం మొత్తాన్ని నేరుగా ఉద్యోగుల జీతాల ఖాతాలకు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

డీఏ విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
డీఏ విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

By

Published : Dec 20, 2021, 7:41 PM IST

Updated : Dec 21, 2021, 5:38 AM IST

Dearness Allowance: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు కొత్త డీఏ విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు 2019 జూలై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం డీఏని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం గతంలో విడుదల చేసిన షెడ్యుల్‌కు అనుగుణంగా 2022 జనవరి నుంచి పెంచిన డీఏని జీతానికి జమ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి జీతంతో కలిపి మూడు విడతలుగా పెరిగిన డీఏని చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఏలో 10 శాతాన్ని ప్రాన్ ఖాతాలకు, మిగతా 90 శాతం మొత్తాన్ని నేరుగా ఉద్యోగుల జీతాల ఖాతాలకు చెల్లించనున్నట్లు ఉత్వర్వుల్లో తెలిపింది. జడ్పీ, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలు, అన్ని ఎయిడెడ్ సంస్థలు, విశ్వవిద్యాలయాల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా డీఏ పెంపు వర్తిస్తుందని ఆర్థికశాఖ వెల్లడించింది.

Last Updated : Dec 21, 2021, 5:38 AM IST

ABOUT THE AUTHOR

...view details