ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నకిలీ వెబ్​సైట్​పై చర్యలు కోరుతూ.. సీఐడీకి వైకాపా ఫిర్యాదు

వైఎస్ఆర్​సీపీ పోల్స్ డాట్ ఇన్ వెబ్ సైట్ ను పోలిన నకిలీ వెబ్ సైట్ ను తెదేపా నేతలు సృష్టించారంటూ వైకాపా నేతలు సీఐడీకి ఫిర్యాదు చేశారు. సైబర్ నేరాల చట్టం కింద దీనిపై కేసు నమోదుచేసి తక్షణం నకిలీ వెబ్ సైట్ ను నిలిపివేయాలని వారిని కోరారు.

ysrcp leaders complained to cid over fraudulent website
నకిలీ వెబ్ సైట్ పై చర్యలు కోరుతూ.. సీఐడీకి వైకాపా ఫిర్యాదు

By

Published : Feb 13, 2021, 10:54 PM IST

పంచాయతీ ఎన్నికల వివరాలను కలిగి ఉన్న వైఎస్ఆర్​సీపీ పోల్స్ డాట్ ఇన్ వెబ్ సైట్ కు నకిలీని రూపొందించటంపై.. వైకాపా సీఐడీకి ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు దీనికి నకిలీ వెబ్ సైట్ ను రూపొందించి.. తప్పుడు ఎన్నికల వివరాలను పొందుపరుస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారంటూ వైకాపా నేతలు సీఐడీకి ఫిర్యాదు చేశారు.

మొదటి విడత పోలింగ్ అనంతరం వైకాపా సానుభూతిపరుల ఫోటోలతో వైఎస్ఆర్సీపీ పోల్స్ డాట్ ఇన్ అనే వెబ్​సైట్​లో వివరాలను పొందుపరిచామని అయితే వాటిని తప్పుదోవ పట్టించేలా.. వైఎస్ఆర్​సీపీ పోల్స్ డాట్ కామ్ అనే నకిలీ వెబ్​సైట్​ను తెదేపా నేతలు రూపొందించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సైబర్ నేరాల చట్టం కింద దీనిపై కేసు నమోదు చేసి తక్షణం నకిలీ వెబ్​సైట్​ను నిలిపివేయాలంటూ సీఐడీని కోరారు. దీంతోపాటు జఫ్ఫా జగన్నాథం అనే ఫేస్​బుక్ పేజీని కూడా నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎస్​ఈసీ విఫలం'

ABOUT THE AUTHOR

...view details