ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపు విజయవాడలో.. "వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌" అవార్డుల ప్రదానోత్సవం

రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ–కన్వెన్షన్‌ సెంటర్‌లో వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబర్చిన, ఉత్తమ సేవలందించిన వారికి ఈ అవార్డులను ఇవ్వనున్నారు.

ysr-lifetime-achievement-awards
ysr-lifetime-achievement-awards

By

Published : Oct 31, 2021, 8:35 PM IST

వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబర్చి, ఉత్తమ సేవలందించిన వారికి రేపు వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా అవార్డుల ప్రధానం రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ– కన్వెన్షన్‌ సెంటర్‌లో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

2021 సంవత్సరానికి 59 అవార్డులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 29 వైఎస్సార్​ లైఫ్​ టైమ్​ అచీవ్‌మెంట్​, 30 వైఎస్సార్​ అచీవ్‌మెంట్​ అవార్డులు ప్రదానం చేయనున్నారు. 9 అవార్డులు సంస్ధలకు, 11 అవార్డులు వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఇవ్వనున్నారు.

కళలు, సంస్కృతి విభాగంలో 20 అవార్డులు, సాహిత్యంలో 7, జర్నలిజంలో 6, కొవిడ్‌ సేవలందించిన ప్రభుత్వ వైద్య సిబ్బందికి 6 అవార్డులు ఇవ్వనున్నారు. నగదు పురస్కారంతోపాటు మెమొంటో, మెడల్​ను రాష్ట్రప్రభుత్వం అందజేయనుంది. సామాన్యులలో అసామాన్య ప్రతిభను గుర్తించి సత్కరిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో తొలిసారిగా వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు, వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు అందిస్తున్నారు.

ఇదీ చదవండి:TTD Go Maha Sammelanam: గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు కొనేందుకు తితిదే సిద్ధం

ABOUT THE AUTHOR

...view details