ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vijayamma:'తండ్రి కలలు సాకారం చేసేందుకే రాజకీయాల్లోకి షర్మిల' - వైఎస్​ విజయమ్మ తాజా వార్తలు

తండ్రి కలలు సాకారం చేసేందుకే షర్మిల రాజకీయాల్లోకి వచ్చారని వైఎస్​ విజయమ్మ అన్నారు. తెలంగాణలో వైఎస్‌ఆర్‌ పాలనకు పునాదులు పడబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్​లో నిర్వహించిన వైఎస్‌ఆర్​ తెలంగాణ పార్టీ ఆవిష్కరణ సభలో పాల్గొని ఆమె ప్రసంగించారు.

ys vijamma spoke about sharmila party
తండ్రి కలలు సాకారం చేసేందుకే రాజకీయాల్లోకి షర్మిల

By

Published : Jul 8, 2021, 7:50 PM IST

'తండ్రి కలలు సాకారం చేసేందుకే రాజకీయాల్లోకి షర్మిల'

శత్రువులైనా.. వైఎస్‌ఆర్‌ను అభిమానించారని వైఎస్​ విజయమ్మ గుర్తు చేసుకున్నారు. నాయకుడంటే వైఎస్‌ఆర్‌లా ఉండాలని పేర్కొన్నారు. నాయకుడంటే తన వాళ్ల కష్టాలు..నష్టాలను భరించేవాడని, ప్రజల బతుకు కోరేవాడే నిజమైన నాయకుడని చెప్పారు. అలాంటి నాయకుడు వైఎస్‌ఆర్‌ ఒక్కరే అని అన్నారు. వైఎస్‌ఆర్‌ జనం కోసం జీవించారని తెలిపారు. ఆయన ఆత్మీయత హావభావాలు జగన్, షర్మిల పుణికి పుచ్చుకున్నారని చెప్పారు.

వైఎస్‌ఆర్‌ మొదలు పెట్టిన ప్రాజెక్టులు ఇప్పటివరకు పూర్తి కాలేదన్నారు. తెలంగాణలో వైఎస్‌ఆర్‌ పాలనకు పునాదులు పడబోతున్నాయని విజయమ్మ చెప్పారు. తండ్రి కలలు సాకారం చేసేందుకే షర్మిల రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. తండ్రి ఆశయాల సాధనం కోసం మీముందుకు వస్తున్నారని, మీ కష్టాల్లో షర్మిల తోడుగా ఉంటుందన్నారు. షర్మిలను మీ కుటుంబసభ్యురాలిగా అక్కున చేర్చుకోవాలని.. షర్మిల పార్టీ ప్రకటన సభలో కోరారు.

'ఖమ్మం సభలో నా బిడ్డను మీకు అప్పగించాను. ఈ మూడు నెలల్లో షర్మిలను టార్గెట్​ చేస్తూ సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టారు. కాంగ్రెస్​ పార్టీ వారు ఎంతో ప్రేమతో రాజశేఖర్​ రెడ్డిని తమ పార్టీ వారిగా చెప్పుకుంటున్నారు. వైఎస్సార్ 35 నుంచి 40 ఏళ్లు ​కాంగ్రెస్​కు సేవ చేశారు. ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్​ఐఆర్​లో పేరు ఎందుకు పెట్టారు. వైఎస్సార్​ కుటుంబాన్ని రోడ్డు మీదికి తెచ్చింది కాంగ్రెస్​ కాదా. ఇదంతా ప్రజలు చూశారు.

ABOUT THE AUTHOR

...view details