ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

YS SHARMILA: 'గొర్రెలు, బర్రెలు ఇచ్చి విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారు' - telangana latest news

కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇచ్చిన హామీ ఏమైందని వైఎస్​ షర్మిల ప్రశ్నించారు. విద్యార్థులు చదువుకోకుంటేనే మేలన్న రీతిలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. గొర్రెలు, బర్రెలు ఇచ్చి వారిని చదువుకు దూరం చేస్తున్నారని విమర్శించారు.

'గొర్రెలు, బర్రెలు ఇచ్చి విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారు'
'గొర్రెలు, బర్రెలు ఇచ్చి విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారు'

By

Published : Jul 1, 2021, 5:40 PM IST

'గొర్రెలు, బర్రెలు ఇచ్చి విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారు'

ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అంటూ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. డబ్బులు లేకనే చాలా మంది చదవలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లిలో ఓ అభిమాని వివాహంలో పాల్గొనేందుకు వచ్చిన షర్మిల.. మార్గమధ్యలో జనగామ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్​లో విద్యార్థులతో మాట్లాడారు.

విద్యార్థులు చదువుకోకుంటేనే మేలన్న రీతిలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని షర్మిల ఆరోపించారు. గొర్రెలు, బర్రెలు ఇచ్చి వారిని చదువుకు దూరం చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

కళాశాలలేమో ఇష్టారీతిన ఫీజులను పెంచేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్​మెంట్​ ఇవ్వడం లేదు. అసలు మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే కదా మనం తెలంగాణ తెచ్చుకున్నది. మరి అలాంటిది వారిని మనం చదివించలేకపోతే, వారి ఫీజులు చెల్లించలేకపోతే ఎందుకు తెచ్చుకున్నట్లు తెలంగాణ. కేజీ నుంచి పీజీ వరకు ఉచితం అన్నారు. ఉచిత విద్య ఎక్కడ కేసీఆర్ సార్​ అని అడుగుతున్నా. పేద పిల్లలు చదువుకోలేకపోతే ఆ కుటుంబాలు పేదరికం నుంచి ఎప్పటికీ బయటకు రాలేవు. ఇది బేసిక్​ లాజిక్​.. మరి దొరగారికి ఇది ఎందుకు అర్థం కావట్లేదో నాకర్థం కావట్లేదు. అసలు కేసీఆర్​ తీరు ఎలా ఉందంటే విద్యార్థులు చదువుకోకుంటేనే బాగుంటుందనేలా వ్యవహరిస్తున్నారు. గొర్రెలు, బర్రెలు ఇచ్చి అందరూ అవే కాసుకుంటూ ఉండండి.. దొరా.. బాంచెన్​.. అంటూ కేసీఆర్​కు సేవలు చేస్తూ ఉండండి.. ఇదీ కేసీఆర్​ దొర తెలంగాణ నెత్తిన రాసిన తలరాత.

-వైఎస్​ షర్మిల

Minister srinivas Goud :AP-TS Water War: ఇటు పులిచింతల.. అటు సాగర్: జలజగడంతో భారీగా భద్రత పెంపు

ABOUT THE AUTHOR

...view details