రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌టీపీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం అన్నీ ఉచితమని షర్మిల ప్రకటించారు.
హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో 'టీమ్ వైస్ఎస్సార్' వెబ్‌సైట్‌ను షర్మిల ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో ఉన్న నాలుగుస్తంభాల్లో ఏ ఒక్క వ్యవస్థ సరిగ్గా పని చేయకపోయినా.. ప్రశ్నించి సరైన మార్గంలో పెట్టేలా చేసే ఐదో స్తంభంగా సోషల్ మీడియా మారిందని షర్మిల అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమం ప్రజల చేతుల్లో ఉన్న ఆయుధంగా ఆమె అభివర్ణించారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడిని తీసుకువచ్చి.. టీపీసీసీ అధ్యక్షుడిని చేసే దుస్థితికి కాంగ్రెస్ చేరిందని వైఎస్ షర్మిల విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు జులై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా.. రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు షర్మిల తెలిపారు.
ప్రజల గొంతు నేరుగా వినిపించేందుకు సోషల్ మీడియానే సరైన వేదికగా మారుతోందన్నారు. ప్రత్యేక ఉద్యోగులతో తెరాస, కాంగ్రెస్ పార్టీలు సోషల్ మీడియాను నడుపుతున్నాయన్నారు. తమ పార్టీకి సోషల్ మీడియా ఎంప్లాయిస్ ఉండరని.. వైఎస్ అభిమానులే వారియర్స్‌గా ఉంటారని పేర్కొన్నారు.