ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లాక్​డౌన్​: సాయానికి కదిలిన కలిదిండి యువత - @corona ap cases

కరోనా వైరస్‌ను కట్టడి చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. కృష్ణా జిల్లా అంతా ఆంక్షల చట్రంలో ఇరుక్కుపోయింది. పనుల్లేక లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా పలువురు దాతలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, యువకులు ముందుకు వస్తున్నారు. పేదలను ఆదుకుంటున్నారు.

youth of krishna dst kalidindi helping poor people by providing food and goods
ఆ మనిషి ఆకలి..ఈ మనసుకు తెలిసె..

By

Published : Apr 14, 2020, 1:28 PM IST

లాక్​డౌన్ కారణంగా రోడ్డునపడ్డ వేలాది కుటుంబాలకు సాయం చేసే చేతులు ముందుకొస్తున్నాయి. కృష్ణా జిల్లా యువకులు ఒక్కొక్కరూ ఒక్కో రూపంలో వితరణ చేస్తున్నారు. పేదలకు అన్నదానం, బియ్యం, కూరగాయల పంపిణీ వంటి వాటితో పాటు కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు శ్రమిస్తోన్న వైద్య, పారామెడికల్, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు, మజ్జగ ప్యాకెట్లు అందిస్తున్నారు. మరికొన్నిచోట్ల యువకులు స్వచ్ఛందంగా గ్రామాల్లో బ్లీచింగ్‌ పిచికారీ చేయిస్తున్నారు.

  • మండవల్లికి చెందిన యువకుడు రూ.1.50లక్షలతో 650 కుటుంబాలకు మాస్క్‌లు, శానిటైజర్లు అందించారు.
  • మండవల్లి మండలం చావలిపాడుకు చెందిన యువకుడు రూ.లక్ష వ్యయంతో నిరాశ్రయులకు బియ్యం, నగదు అందజేశారు.
  • తిరువూరు శ్రీవైష్ణవ సంఘ సభ్యులు వలస కూలీలకు, ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు అన్నదానం చేశారు.
  • తిరువూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 1995-97 పూర్వ విద్యార్థులు వృద్ధులు, అనాథలకు అన్నదానం చేశారు.
  • మచిలీపట్నానికి చెందిన హెల్పింగ్‌ స్పాట్‌ యువకులు పేదలకు ఆహారం అందిస్తున్నారు. చిన్న పిల్లలకు పాలు సరఫరా చేస్తున్నారు. బందరు చుట్టుపక్కల రోగుల వైద్య నిమిత్తం అస్వస్థతకు గురైతే వారిని తీసుకెళ్లేందుకు 2 కార్లు ఏర్పాటు చేశారు.

కలిదిండి మండలం కోరుకొల్లు ప్రధాన కూడలిలో యువకుల ఆధ్వర్యంలో 18 రోజులుగా పేదలకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రోజూ 200 మందికి ఆకలి తీరుస్తున్నారు. దీనికి గ్రామస్థులు తమవంతుగా సహకారాన్ని అందిస్తున్నారు. కలిదిండి జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద యువత నేతృత్వంలో వలస కూలీలు, కార్మికులకు 16 రోజులుగా భోజన వసతి కల్పిస్తున్నారు. యువ ఫౌండేషన్‌ సభ్యులు యాచకుల ఆకలి తీరుస్తున్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాలకు వెళ్లి నిస్సహాయులకు గుర్తించి వారికి చేయూతనిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details