కొత్త జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని.. విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ యాత్రను(bike rally) విజయవాడలో పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి నేతలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అక్రమ అరెస్టు చేశారని.. ఆందోళను అణచివేయాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం ఉద్ధృతం చేస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు.
'అరెస్టులతో అణచివస్తే.. రాష్ట్ర వ్యాప్త పోరాటమే..' - జాబ్ క్యాలెండర్‌పై విద్యార్థుల నిరసన వార్తలు
అసంపూర్ణంగా ఉన్న జాబు క్యాలెండర్‌ను(job calender) సరిచేయాలని విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. పూర్తిస్థాయి ఖాళీలతో తక్షణమే రాష్ట్రప్రభుత్వం కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు.
youth leaders arrest in vijayawada