ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా 'షో' కొట్టినా.. మారని జల్సారాయుళ్లు!

విజయవాడలో ఇద్దరు లారీ డ్రైవర్ల నుంచి 38 మందికి కరోనా సోకిందన్న సంచలన ఘటన వెలుగుచూసినా... కొందరిలో మాత్రం ఇంకా చలనం రావటం లేదు. గుణదల మైత్రినగర్​లోని మంచినీటి ట్యాంకు ఆవరణలో గుంపులు గుంపులుగా చేరి పేకాట ఆడుతూ, మద్యం సేవిస్తూ జల్సా చేశారు. కరోనా వేళ ప్రభుత్వం చేస్తున్న సూచనలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అంటున్నారు.

youth are playing cards in water tank in gunadala
కరోనా షో కొట్టిన.. మారని జల్సారాయుళ్లు

By

Published : Apr 26, 2020, 1:26 PM IST

విజయవాడలో ఇద్దరు లారీడ్రైవర్ల​ నుంచి 38 మందికి కరోనా వైరస్ సోకింది. అంతకు ముందే వైరస్ సోకిన లారీ డ్రైవర్... తన సన్నిహితులతో పేకాట ఆడిన కారణంగా.. మిగిలిన వారికి కరోనా వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. విజయవాడలో సంచలనం రేపిన ఈ ఘటనతో మరింత అప్రమత్తంగా ఉండాల్సినా.. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

గుణదల మైత్రినగర్ కొండపైన మంచినీటి ట్యాంకు వద్ద కొందరు జల్సా రాయుళ్లు పేకాట మొదలుపెట్టారు. దౌర్జన్యంగా మంచినీటి ట్యాంకు ఆవరణలోకి వచ్చి పేకాడారు. మద్యం సేవించారు. వీరి తీరు తమకు ఇబ్బందిగా ఉందని స్థానికులు అంటున్నారు. ఆవరణాన్ని అపరిశుభ్రంగా మారుస్తున్నారని వాల్వులు ఆపరేట్ చేసే సిబ్బంది ఆరోపించారు. అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details