కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ దిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనకు మద్ధతుగా.. విజయవాడ లెనిన్ కూడలిలో విద్యార్థి, యువజన సంఘాలు నిరసన చేపట్టాయి. కనీస చర్చ జరగకుండా వ్యవసాయ బిల్లులను పార్లమెంట్లో ఆమోదించడం దారుణమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రసన్నకుమార్ విమర్శించారు.
కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చడానికే ఈ చట్టాలను తీసుకువచ్చారని ప్రసన్నకుమార్ ఆరోపించారు. రైతులకు నష్టం కలిగించే ఈ కొత్త చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వాటిని ఉపసంహరించే వరకు రైతు ఉద్యమాలకు అండగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.