పెట్టుబడుల అంశంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తప్పు పట్టారు. "దావోస్ వెళ్లి ఎన్నివేల కోట్లు తెచ్చారని మీరు చంద్రబాబును అడుగుతున్నారు... ఐదేళ్లుగా మీరు దిల్లీలో ఎవరి పాదపూజ చేశారు" అంటూ విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. చంద్రబాబు తాగిన నీళ్ల బాటిళ్లు, తిని వదిలేసిన ప్లేట్ల లెక్కలు కాకుండా.. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఆయన పడిన కష్టాన్నిలెక్కలేయాలని సూచించారు. "పెద్దల సభలో ఉన్నారు... కాస్తైనా పెద్దరికం తెచ్చుకొండి" ఉంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.
'పెద్దలసభలో ఉన్నారు... పెద్దరికం తెచ్చుకోండి' - budda
రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిపై తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్వీటర్ వేదిగా విమర్శలు గుప్పించారు. పెట్టుబడుల అంశంలో చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలపై బుద్దా ఘాటుగా స్పందించారు.
'పెద్దలసభలో ఉన్నారు...పెద్దరికం తెచ్చుకోండి'