ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RESULTS : ఫలితాలు విడుదల... ఉత్తీర్ణుల్లో మహిళలే అత్యధికం - minister audimulapu suresh

పీజీ పరీక్ష ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. ఈ పరీక్షలో 76శాతం మంది అర్హత సాధించినట్లు వెల్లడించారు.

ఆదిమూలపు సురేశ్
ఆదిమూలపు సురేశ్

By

Published : Nov 9, 2021, 4:55 PM IST

యోగి వేమన వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ విడుదల చేశారు. పీజీ పరీక్షలో 76శాతం మంది అర్హత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. వీరిలో అత్యధికంగా మహిళలే ఉన్నారని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పరీక్షకు... 39,856 మంది దరఖాస్తు చేశారని మంత్రి సురేశ్‌ వివరించారు.

పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ) ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2021ను ఉన్నత విద్యామండలి అక్టోబర్​లో నిర్వహించింది. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా, ర్యాంకులు కేటాయించి ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జేఎన్‌టీయూలు మినహా మిగతా అన్ని వర్సిటీల్లోని పీజీల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. అన్ని వర్సిటీల్లో కలిపి 12వేల వరకు సీట్లు ఉండగా.. 50వరకు వివిధ రకాల కోర్సులున్నాయి. ఒక్కో కోర్సుకు ఒక్కో పరీక్ష నిర్వహిస్తారు.

ఇదీచదవండి.

ABOUT THE AUTHOR

...view details