ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

World Kidney Day: నానాటికీ పెరుగుతున్న కిడ్నీ రోగులు.. కారణాలేంటి..? - కిడ్నీ దానాలు

World Kidney Day: మూత్రపిండాల వైఫల్య బాధితుల సంఖ్య ప్రతీ ఏటా పెరగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అసలు కిడ్నీ వ్యాధులకు గురవడానికి కారణాలేంటి ? మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతినే వరకూ ఎందుకు గుర్తించలేకపోతున్నారు ? అవగాహనా లోపమా? లేక మారుతున్న జీవన విధానమా? ఇంటర్నేషనల్ కిడ్నీ డే సందర్భంగా అవగాహన చేసుకుందాం.

World Kidney Day
World Kidney Day

By

Published : Mar 10, 2022, 11:43 AM IST

రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న కిడ్నీ రోగులు...కారణాలేంటి..??

Kidney Diseases: మానవ శరీరంలో కీలక అవయవాలు మూత్రపిండాలు. మన దేశవ్యాప్తంగా 10కోట్ల మంది కిడ్నీ బాధితులున్నారని అంచనా. ఏటా 2 లక్షల మంది కిడ్నీ వ్యాధుల బారినపడుతుండగా, మూత్రపిండాల సంబంధిత వ్యాధితో 24 లక్షల మంది ప్రాణాలు విడుస్తున్నారు. 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా.. కిడ్నీ సంబంధిత మరణాలు ఐదో స్థానంలో... ఉంటాయని అధ్యయనాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో కిడ్నీ కేసులు ఎక్కువగా కృష్ణా, శ్రీకాకుళం, ఇతర జిల్లాల్లో నమోదవుతున్నాయి. తాగేనీరు, ఆహార అలవాట్లూ కిడ్నీ వ్యాధులకు దారి తీస్తున్నాయి. కొవిడ్‌ ప్రభావం.. కిడ్నీ వ్యాధిగ్రస్తులపై తీవ్రస్థాయిలో కనిపించిందని నెఫ్రాలజిస్టులు చెబుతున్నారు. కిడ్నీ బాధితుల్లో 50 శాతం మంది మధుమేహులేనని వైద్యులు చెప్తున్నారు. ప్రతి పది మందిలో ఒక్కరికి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు.

"ప్రతీ ఏటా మూత్రపిండాల వైఫల్య బాధితుల సంఖ్య పెరుగుతోంది. తినే ఆహారం, ఉపయోగించే మందులు, మధుమేహం వలన ఎక్కువగా కిడ్నీలు దెబ్బతింటున్నాయి. మూత్ర పిండాల వైఫల్య బాధితుల్లో సగం మంది షుగర్ వ్యాధిగ్రస్తులే. భవిష్యత్తులో మనదేశం మధుమేహుల రాజధానిగా మారనుంది. షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగితే కిడ్నీ వ్యాధిగ్రస్తలు సంఖ్య కూడా పెరుగుతుంది. యువకులు ఎక్కువగా ప్రొటీన్, గోధుమ సంబంధిత ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం,నొప్పి నివారణ మాత్రలు ఎక్కువగా సేవించడం కిడ్నీలు వైఫల్యం చెందుతాయి. డయాలసిస్ చేయాల్సి కూడా రావచ్చు. కొంతమందిలో శాశ్వతంగా కిడ్నీలు వైఫల్యం చెందుతాయి. అలాంటి వారికి ఎలాంటి చికిత్స అందించినా ప్రయోజనం ఉండదు. డయాలసిస్ తో అవ్వని పక్షంలో కిడ్నీ మార్పునకు వెళ్లాల్సి ఉంటుంది."-డా. రమేష్, నెఫ్రాలజిస్ట్

ఇదీ చదవండి :Inam Lands in AP: ‘ఇనాం’ భూముల ద్వారా ఆదాయంపై ప్రభుత్వం దృష్టి..?

Kidney Diseases: రాష్ట్రంలో అవయవదానాల్లోనూ కిడ్నీల మార్పిడి కేసులే అత్యధికంగా ఉంటున్నాయి. కోమాలో ఉన్న వారి నుంచి ఇప్పటిదాకా 609 అవయవాల దానం జరగ్గా ఇందులో 329 కిడ్నీలే ఉన్నాయి. కిడ్నీలు దొరక్క చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారని వైద్యులంటున్నారు. అందుకే పూర్తిగా కిడ్నీలు పాడవక ముందే మేల్కోవాలని సూచిస్తున్నారు.

కిడ్నీలు వైఫల్యం చెందినవారు లక్షల్లో ఉంటే అవయవదానం చేసే వారి సంఖ్య వందల్లోనే ఉంది. రకరకాల అవయవాల కోసం జీవన్‌దాన్‌ ద్వారా 2,283 మంది వేచి చూస్తుండగా అందులో 1,608 మంది కిడ్నీల కోసం నిరీక్షిస్తున్నారు.

"డయాబెటిక్ నెఫ్రోపతిలో మనకు తొలిదశలో మూత్రం ద్వారా ప్రొటీన్లు పోతాయి. ఆ సమయంలో మనం గుర్తిస్తే...జబ్బుకు సరైన చికిత్స అందించవచ్చు. బాగా దెబ్బ తిన్నతర్వాత వెళ్తే కొంతవరకూ జబ్బును ఆపొచ్చు కానీ పూర్తిగా తగ్గించలేము. కిడ్నీలు బాగా దెబ్బతింటే వాంతులు,వికారం, ఆకలి మందగించడం, కొంతమందిలో కాళ్ల వాపులు కనిపిస్తాయి. 80శాతం మందికి ఇలాంటి లక్షణాలు బయటపడవు కాబట్టి కిడ్నీ సమస్యలు గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. సీరం కెరాటిన్ అనే పరీక్ష ద్వారా చాలా తక్కువ ఖర్చులోనే స్ర్కీనింగ్ చేసుకోవచ్చు. వయసు పైబడిన వారికి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ" -డా.శశిధర్, నెఫ్రాలజిస్ట్


ఇదీ చదవండి :

Movie Tickets: సినిమా టికెట్లపై అప్పుడలా..ఇప్పుడిలా..ఎందుకిలా?

ABOUT THE AUTHOR

...view details