తెలుగుదేశం పార్టీ నాయకులపై వైకాపా ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ లక్ష్యంగా తెలుగుదేశం నేతలు చేస్తున్న వ్యాఖ్యలను వివరించామని.. రాష్ట్రపతితో భేటీ తర్వాత ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు తెదేపా అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు దిల్లీ వచ్చారని ఆరోపించారు. రాజ్యాంగ పదవులను కించపరిచేలా ప్రవర్తిస్తే..చర్యలు తీసుకునేలా చట్టం తేవాలని ఇందుకు తగిన సూచనలు చేయాలని రాష్ట్రపతిని కోరినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు.
సంస్కారం గురించి వైకాపా మాట్లాడటం దురదృష్టకరం