బంగారం లాంటి విశాఖ ఉక్కును అమ్మే యత్నాలను ఉపసంహరించుకోవాలని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆయన... పెట్టుబడులు ఉపసంహరణ కాకుండా పన్నుల పెంపు లాంటి ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని సూచించారు. కార్మికులు, ఉద్యోగుల ఆందోళనలను పట్టించుకోని రీతిలో కేంద్రం వ్యవహరించడం సరికాదన్నారు. ప్రైవేటీకరణ అంశాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
'బంగారం లాంటి విశాఖ ఉక్కును అమ్మే యత్నాలు సరికాదు' - vizag steel plant privatization
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో మాట్లాడారు. స్టీల్ ప్లాంటును అమ్మే యత్నాలను విరమించుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఎంపీ విజయసాయిరెడ్డి