ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జనసేనానిని కలిసిన వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి తండ్రి రెడ్డయ్య

వైకాపా ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తండ్రి రెడ్డయ్య యాదవ్... జనసేన అధినేత పవన్ కల్యాణ్​ను కలిశారు. పెద్దపూడి క్రాస్​ రోడ్డు వద్ద పవన్​ను కలిసిన ఆయన.. రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని వివరించారు. ప్రభుత్వం నష్టం అంచనాలు తప్పుల తడకగా ఉంటాయన్నారు.

ycp mla parthasaradhi father reddaiah meets pawan kalyan and talks about crop damages
జనసేనాని కలిసిన వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి తండ్రి రెడ్డయ్య

By

Published : Dec 2, 2020, 3:17 PM IST

Updated : Dec 2, 2020, 4:05 PM IST

జనసేనాని కలిసిన వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి తండ్రి రెడ్డయ్య

జనసేన అధినేత పవన్ కల్యాణ్​ను వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి తండ్రి, మాజీ ఎంపీ కె.పి.రెడ్డయ్య...పెద్దపూడి క్రాస్​రోడ్డు వద్ద కలిశారు. తుపాన్​ వల్ల రైతులు చాలా దారుణంగా నష్టపోయారని ఆయన పవన్ దృష్టికి తీసుకొచ్చారు.

వైకాపా ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని రెడ్డయ్య పవన్​కు తెలిపారు. ప్రభుత్వం నమోదు చేస్తున్న పంట నష్టం అంచనాల నమోదు అంతా తప్పులేనని... ప్రస్తుతం ప్రభుత్వం చేస్తుందంతా మోసమేనని, ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై పోరాడాలని కోరారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు రౌండ్ టేబుల్ సమావేశం పెడదామని పవన్ రెడ్డయ్యతో అన్నారు.

పొలాల పరిశీలన

పవన్ కల్యాణ్ పామర్రు మండలం ఉండ్రపూడి క్రాస్​రోడ్డు వద్ద కుళ్లిపోయిన వరి పొలాలను పరిశీలించి... ఉండ్రపూడి వద్ద రైతులను పరామర్శించారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా పరామర్శించడానికి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పోరాడతామని హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్య పడవద్దని తెలిపారు.

ఇదీ చదవండి:

జగన్​ది అర్ధరాత్రి ప్రభుత్వం: దివ్యవాణి

Last Updated : Dec 2, 2020, 4:05 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details