తెలుగుదేశం విడుదల చేసిన చార్జ్‌షీట్‌లో అనవసరంగా తన పేరును ప్రస్తావించారంటూ.... వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి దీక్షకు దిగారు. విజయవాడ ధర్నాచౌక్‌లో..... చంద్రబాబు దీక్షాస్థలికి ఎదురుగా... దీక్ష చేపడుతున్నారు. పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ.. క్యాంపు కార్యాలయం నుంచి అనుచరులతో కలిసి నిరసన తెలిపేందుకు వచ్చారు. రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకే ప్రాంతంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు తాము అనుమతి ఇవ్వలేమని... బుధవారమే పోలీసులు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే దీక్ష చేస్తున్న ప్రాంతంలో భారీగా బందోబస్తు చేపట్టారు.
తెదేపా ఆరోపణలపై వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి దీక్ష - విజయవాడలో తెదేపా ఆరోపణలపై మ్మెల్యే పార్థసారథి దీక్ష
విజయవాడ బందర్‌రోడ్డులో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి దీక్ష చేపట్టారు. తన క్యాంపు కార్యాలయం వద్ద అనుచరులతో నిరసన కొనసాగిస్తున్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఆందోళన చేస్తున్నారంటూ పోలీసులు భారీగా మోహరించారు.

ycp
తెదేపా ఆరోపణలపై వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి దీక్ష
ఇవి కూడా చదవండి: