108లో స్కామ్ జరిగిందంటోన్న తెదేపా అధినేత చంద్రబాబు...దీనిపై బహిరంగ చర్చకు ముందుకు రావాలని వైకాపా సవాల్ విసిరింది. అవినీతి జరిగిందని ఆరోపిస్తోన్న తెదేపా నేతలు ఎక్కడ జరిగిందో.. వీటి ఆధారాలేంటో బయట పెట్టాలని ఆ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేశ్ డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 108, 104 సర్వీసులకు పునర్వైభవం తెచ్చారని.. పారదర్శకంగా టెండర్లు జరిపారన్నారు. చంద్రబాబు పాలనలో 108, 104 సర్వీసులు నిర్వీర్యమయ్యాయని...ప్రజలు ఫోన్ చేసి నిరీక్షించినా వాహనం రాని దుస్ధితి ఉండేదన్నారు.
108పై బహిరంగ చర్చకు సిద్ధమా?: జోగి రమేశ్
అసత్య ఆరోపణలు చేస్తోన్న చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదాలో కొనసాగే అర్హత లేదని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్ విమర్శించారు. 108లో స్కామ్ జరిగిందంటోన్న చంద్రబాబు...దీనిపై బహిరంగ చర్చకు ముందుకు రావాలని సవాల్ విసిరారు.
108 కుంభకోణంపై బహిరంగ చర్చకు సిద్ధమా?: జోగి రమేశ్
అసత్య ఆరోపణలు చేస్తోన్న చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదాలో కొనసాగే అర్హత లేదన్నారు. ప్రభుత్వాన్ని అభినందించకపోయినా ఫర్వాలేదు కానీ రాళ్లు వేయొద్దన్నారు. చంద్రబాబు తనకు బలం ఉంటే తన వర్గం వారిని గెలిపిస్తారని..బలం లేనప్పుడు బలహీన వర్గాలను బలిపశువును చేస్తారని రాజ్యసభ అభ్యర్థి వర్ల రామయ్యను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.