ఇసుకను వైకాపా నేతలు దోచుకుంటున్నారని విశాఖ లాంగ్‌మార్చ్‌లో పవన్‌కల్యాన్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. లోకేశ్ 6 గంటల నిరాహార దీక్ష, పవన్ లాంగ్మార్చ్లతో ఏం సాధించారంటూ ప్రశ్నించారు. లాంగ్‌మార్చ్‌లో తెదేపా నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివాల్సిన దుస్థితి పవన్‌కు వచ్చిందన్నారు. కూలిపోయిన తెదేపా భవనాన్ని మళ్లీ నిర్మించటమే మీ సిద్ధాంతమా అంటూ పవన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు పవన్ దత్తపుత్రుడంటూ వ్యాఖ్యానించారు.
తెదేపా స్క్రిప్ట్‌నే పవన్ చదివారు: అంబటి - latest news of ambati comments on pavan
విశాఖ లాంగ్ మార్చ్‌లో తెదేపా నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ ను పవన్‌కల్యాణ్ చదివారంటూ ఎమ్మెల్యే అంబటి రాంబాబు జనసేన అధినేతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
![తెదేపా స్క్రిప్ట్‌నే పవన్ చదివారు: అంబటి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4954026-694-4954026-1572852087534.jpg)
పవన్‌పై అంబటి విమర్శలు