విజయవాడ సమీపంలో ఉన్న నున్న గ్రామంలో వైకాపా నేతలు కరోనా నిబంధనలకు తూట్లు పొడిచారు. వైఎస్సార్ వర్థంతి సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 వేల మందికి పైగా ప్రజలు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా ప్రజలంతా గూమికూడితే.. కరోనా మరింత ప్రబలే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నాయకులకు కరోనా నిబంధనలు వర్తించవా అని స్థానికులు మండిపడ్డారు.
అధికార పార్టీ శ్రేణులకు నిబంధనలు వర్తించవా? - నున్న వైకాపా నేతలు న్యూస్
కరోనా వ్యాప్తి చెందుతున్నందున అవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ అధికార పార్టీ నేతలు, ఒక పక్క ఊదరగొడుతున్నారు.. మరో పక్క భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి..పెద్ద ఎత్తున ప్రజలను ఒక్కచోట చేర్చుతున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు చెప్పే కరోనా నిబంధనలు వారికి వర్తించవా? అని ప్రశ్నిస్తున్నారు.
నిబంధనలు అతిక్రమించిన వైకాపా నేతలు