చంద్రబాబు దిల్లీ పర్యటనపై తమ పార్టీ నేతలు కలత చెందుతున్నారని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణ రాజు అన్నారు. చంద్రబాబుతో ఫోనులో అమిత్ షా మాట్లాడంపై ఆవేదన చెందుతున్నారని తెలిపారు. వైకాపా ఆందోళన విజయసాయిరెడ్డి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. అంతేకాకుండా తెదేపా, భాజపా దగ్గర అవుతాయని తమ పార్టీ నేతలు భయపడుతున్నారని అన్నారు.
చంద్రబాబు దిల్లీ పర్యటనపై.. మా పార్టీ కలత చెందుతోంది: ఎంపీ రఘురామ - చంద్రబాబు
చంద్రబాబుతో అమిత్ షా (ఫోన్లో) మాట్లాడడంపట్ల.. వైకాపా నేతలు కలత చెందుతున్నారని ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. వైకాపా ఆందోళన విజయసాయిరెడ్డి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.
ఎంపీ రఘురామ
తనకు తెలిసిన సమాచారం ప్రకారం.. పట్టాభిని కొట్టారని ఎంపీ రఘురామ ఆరోపించారు. పట్టాభిని కొట్టారా.. లేదా అని విజయసాయిరెడ్డి చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారని, జగన్ అవినీతి కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ శుభపరిణామమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:Minister Perni nani: ఒకే రాష్ట్రంగా కలిసుందాం.. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయండి: పేర్ని నాని