ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా పురఎన్నికల బహిష్కరణ అంతా బూటకం: అంబటి - municipal elections

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్​లో వైకాపా నేతలు పుర ప్రచారం చేపట్టారు. తెదేపా ఎన్నికల బహిష్కరణ అభ్యర్థులు లేకపోవడంతోనేనని వైకాపా నేతలు వ్యాఖ్యానించారు.

municipal elections
తెదేపా పురఎన్నికల బహిష్కరణ బూటకం: అంబటి

By

Published : Mar 4, 2021, 3:37 PM IST

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్​లో వైకాపా అభ్యర్థి చైతన్య రెడ్డికి మద్దతుగా సత్తెనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అంబటి రాంబాబు, పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రచారంలో నిర్వహించారు. మున్సిపల్​ ఎన్నికల బహిష్కరణ అనే మాట చౌకబారు రాజకీయాలకు నిదర్శనమన్నారు.

అంతిమ విజయం వైకాపాదే..

తెదేపా నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు లేక.. ఆ పార్టీ నాయకులు పలాయనం చిత్తగించటంలో భాగంగానే ఎన్నికలను బహిష్కరిస్తామని కొత్త స్వరం అందుకున్నారని అంబటి ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో వైకాపా జెండా నూరు శాతం ఖాయమని ఎమ్మెల్యే జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:బీ ఫారాలు అందజేత.. బరిలోకి ఉత్సాహంగా అభ్యర్థులు

ABOUT THE AUTHOR

...view details