ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Sajjala: 'మంచి చేయాలని చూస్తున్నాం.. బురద చల్లాలని చూస్తే పవన్​కే ఇబ్బంది'

ఆన్​లైన్ టికెటింగ్ విషయంలో పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. పవన్‌ గురించి సినీ పరిశ్రమలోనే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. కడప జిల్లాలోని బద్వేల్ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుని పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా చూస్తామని చెప్పారు.

ycp leader sajjala reacts over pawan kalyan words
'మంచి చేయాలని చూస్తున్నాం.. బురద చల్లాలని చూస్తే పవన్​కే ఇబ్బంది'

By

Published : Sep 28, 2021, 1:34 PM IST

ఆన్​లైన్ టికెట్లపై.. జనసేన అధినేత పనన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సినీ పరిశ్రమకు మంచి చేయాలని చూస్తున్నామని.. బురద చల్లాలని చూస్తే పవన్‌ కల్యాణ్​కే ఇబ్బందిగా మారుతుందని అన్నారు.

జనసేన అధినేత పనన్ కల్యాణ్​పై.. వైకాపా నేత సజ్జల విమర్శలు

సినీ పరిశ్రమకు మంచి చేయాలని చూస్తున్నాం. బురద చల్లాలని చూస్తే పవన్‌కే ఇబ్బందిగా మారుతుంది. పవన్‌ను సినీ పరిశ్రమ పెద్దలే గుదిబండగా భావిస్తున్నారు. పవన్.. సినిమా, రాజకీయాలు అనే రెండు పడవలపై కాళ్లు పెట్టారు. సినీ పరిశ్రమకు సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆన్‌లైన్ టికెటింగ్ విధానంతో డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉన్నారు. ఆన్‌లైన్ టికెటింగ్ విధానం ద్వారా పారదర్శకత సాధ్యం. పవన్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. మటన్‌ షాపులు పెడతారన్న ప్రచారంలో వాస్తవం లేదు. మటన్‌ షాపుల్లో శుభ్రత పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఏ అంశాలు లేనందువల్లే ఏదో ఒక విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు

కడప జిల్లాలోని బద్వేలులో జరగాల్సిన ఉపఎన్నికలో.. తమ పార్టీ తప్పకుండా గెలుస్తుందని సజ్జల అన్నారు. ప్రతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని.. ప్రజల అభిమానం, ఆదరణ పార్టీకి ఉంటుందన్నారు.

ప్రతి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. ప్రజల అభిమానం, ఆదరణ పార్టీకి ఉంటుంది. మేమేం చేశామో ప్రజల ముందుకు తీసుకెళ్తాం. బద్వేలులో మంచి మెజారిటీతో గెలుస్తాం. - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు.

ఇదీ చదవండి:

By Election Schedule 2021: బద్వేలు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details