తెదేపా నేత అచ్చెన్నాయుడు వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. వైకాపా బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో ఆయన పాత్ర ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారన్నారు. ఎవరు తప్పుచేసినా చట్టం ఊరుకోదన్నారు.
'అచ్చెన్నాయుడి అరెస్ట్ బీసీలపై దాడి కాదు' - అచ్చెన్నాయుడు తాజా వార్తలు
అచ్చెన్నాయుడి అరెస్ట్ బీసీలపై దాడి కాదని.. చంద్రబాబు, లోకేశ్‌లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వైకాపా బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని.. తప్పు చేసిన వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టంచేశారు.
జంగా కృష్ణమూర్తి, వైకాపా బీసీ సెల్ అధ్యక్షుడు
చంద్రబాబు ప్రతిదానికి కులం రంగు పులుముతున్నారని.. అచ్చెన్నాయుడు అరెస్టుపై నిరసనలు చేయాలని పిలుపునివ్వడం హాస్యాస్పదమని విమర్శించారు. అచ్చెన్న అరెస్టును బీసీలపై దాడిగా పేర్కొనడం అవివేకమని మండిపడ్డారు. తెదేపా హయాంలో చేసిన అక్రమాలు చాలా ఉన్నాయని.. వాటన్నింటిపైనా విచారణ జరిపి చర్యలు తీసుకుంటారన్నారు.
ఇవీ చదవండి.. అచ్చెన్నాయుడిపై ఈఎస్'ఐ'.. ఏసీబీ ఏం చెబుతుందంటే..?