జలీల్‌ఖాన్ వాహనంపై వైకాపా నేతల దాడి - ycp attack
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రణరంగంగా మారింది. ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వాహనంపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రణరంగంగా మారింది. ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వాహనంపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న జలీల్ ఖాన్ మద్దతు దారులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకున్నారు. తమ నాయకుడిపై దాడి చేసిన వారిపై ప్రతిదాడికి పాల్పడ్డారు. ఈ పరిణామాలతో.. పశ్చిమ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని.. ఇరు వర్గాలను చెదరగొట్టారు. దాడిపై స్థానిక సీఐ కాశీ విశ్వనాధ్.. వివరాలు తెలుసుకున్నారు.