ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రాంతీయ భాషల విషయంలో కేంద్రం ఆలోచన దుర్మార్గం: యార్లగడ్డ - Yarlagadda comments on regional languages

భాషా పరిశోధన సంస్థలను ఒకే యూనివర్సిటీగా మార్చాలన్న కేంద్రం నిర్ణయం సరైనది కాదని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. అలా చేస్తే పరిశోధనకు ఉన్న ప్రాధాన్యత మరుగున పడిపోతుందని చెప్పారు.

Yarlagadda Lakshmi Prasad
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

By

Published : Apr 6, 2021, 4:43 PM IST

ప్రాంతీయ భాషల విషయంలో కేంద్రం దుర్మార్గంగా ఆలోచిస్తోందని... రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విజయవాడలో అన్నారు. తమిళ, సంస్కృత, తెలుగు, కన్నడ, మళయాళం, ఒరియా భాషలకు ప్రాచీన భాషలుగా హోదా ఇచ్చిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలుగు భాషా విశిష్ఠ అధ్యయన కేంద్రం నెల్లూరులో ఏర్పాటు చేశారని... భాషా పరిశోధన సంస్ధలను అన్నీ కలిపి ఒక యూనివర్శిటీగా మార్చాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు.

అదే జరిగితే... పరిశోధనకు ఉన్న ప్రాధాన్యత మరుగున పడిపోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన గోపాల స్వామి కమిటీలో తెలుగువారికి చోటు లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం విశిష్ఠ అధ్యయన కేంద్రాలను కొనసాగించాలని యార్లగడ్డ డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details