తెదేపా నేతల అరెస్టులను యనమల రామకృష్ణుడు ఖండించారు. తప్పుల మీద తప్పులు చేస్తోంది.. జగనేనని యనమల దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ ఒక తప్పు అయితే జెసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డి అరెస్టులు మరో తప్పని మండిపడ్డారు. తప్పులను సరిదిద్దుకునే ధైర్యం జగన్‌కు లేదని యనమల విమర్శించారు. కోర్టుల తీర్పులను జగన్ సహించలేరన్నారు. రోజురోజుకూ కక్ష సాధింపు పెరిగిపోతోందని.. జగన్ పతనానికి బాటలు పడుతున్నాయన్నారు. ఇప్పటికే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు వైకాపా దూరం అయ్యిందన్న యనమల... బాధిత వర్గాల ప్రజలే వైకాపాకి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు.. 100 తప్పులు: యనమల - తెదేపా నేతల అరెస్టు న్యూస్
అనంతపురం తెదేపా నాయకులు జెసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్ట్‌ను తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఖండించారు. ఒక తప్పు కప్పిపుచ్చడానికి జగన్ 100తప్పులు చేస్తున్నారని అందులో భాగంగానే తెదేపా నాయకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.
yanamala ramkrishnudu fires on jagan