రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందటానికి కారణం ముమ్మాటికీ ముఖ్యమంత్రి జగన్ ఆలోచనా విధానాలే కారణమని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. జగన్ రాజకీయాలకే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా పట్ల నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనా పరీక్షల్లో వాస్తవాలు దాచిపెడుతూ... తప్పుడు లెక్కలు విడుదల చేస్తున్నారని యనమల ఆరోపించారు. కరోనా కట్టడికి కేంద్ర సహాయం అందుతున్నా.. వాటిని తన కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా మళ్లిస్తున్నారని మండిపడ్డారు.
ఉత్పత్తిపై దృష్టి పెట్టకుంటే ప్రమాదమే