జగన్ అక్రమాస్తులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని.. తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. విజయమాల్యా, నీరవ్ మోదీ, చోక్సీకి సంబంధించి ఆస్తులను బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వానికి ఈడీ అప్పగించిందని.. అదే రీతిలోనే సీబీఐ అఫిడవిట్‌లో పేర్కొన్న రూ.43వేల కోట్ల జగన్ అక్రమ సంపదను ప్రజాపరం చేయాలన్నారు. ఇంకా జప్తు చేయని జగన్ అవినీతి సంపదను కూడా స్వాధీన పరుచుకోవాలని ఓ ప్రకటనలో కోరారు.
'జగన్ అక్రమాస్తులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి' - cm jagan illegal assets case latest news
మాల్యా, నీరవ్ మోదీ, చోక్సీ ఆస్తులు కేంద్ర ప్రభుత్వానికి ఈడీ అప్పగించిందని.. ముగ్గురి కేసుల్లో ఉన్న వేగం జగన్ కేసుల్లో లేకపోవడం శోచనీయమని తెదేపా సీనియర్ నేత యనమల అన్నారు. జగన్ రూ.43 వేల కోట్ల అక్రమ సంపదను ప్రజాపరం చేయాలని డిమాండ్ చేశారు.
ఆ అక్రమ ఆస్తులను అమ్మగా వచ్చిన సొమ్మను రాష్ట్రాభివృద్దికి ఖర్చుపెట్టాలని యనమల అన్నారు. ఆర్థిక నేరాలు, డొల్ల కంపెనీలు, మనీ లాండరింగ్‌లో విజయమాల్యా, నీరవ్, చోక్సీల నేరాలకు జగన్ నేరాలకు సామీప్యత ఉందని ఆరోపించారు. ఈ ముగ్గురి కేసుల్లో ఉన్న వేగం జగన్ కేసుల్లో లేకపోవటం శోచనీయమన్నారు. జగన్ రెడ్డిది దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణమని యనమల ఆరోపించారు. స్వల్పకాలంలో 1100రెట్లు సంపద పెరగటం పట్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తే విస్తుపోయారని యనమల పేర్కొన్నారు.రూ. 43వేల కోట్లలో దాదాపు రూ.10వేల కోట్ల ఆస్తులను ఇప్పటికే జప్తు చేసినందున మిగిలిన అక్రమ సంపదను ప్రభుత్వానికి అప్పగించాలని సూచించారు.
ఇదీ చదవండి:
పోలీసు కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్ నియామకంపై రఘురామ లేఖ
TAGGED:
సీఎం జగన్ అక్రమాస్తుల కేసు