పురపాలక ఎన్నికల్లో అవినీతి డబ్బు, అధికార బలం, పోలీసుల అండతో వైకాపా విజయం సాధించిందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలు నిలిపేస్తామని బెదిరించి ఎన్నికల్లో గెలుపొందారని విమర్శించారు. తప్పుడు కేసులతో వేధించి ఓట్లు వేయించుకోవటం వైకాపా దుష్ట రాజకీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా ప్రజాభిమానమే ఉండి ఉంటే..రాష్ట్రవ్యాప్తంగా ఇన్ని దౌర్జన్యాలు, విధ్వంసాలు చేయాల్సిన పని లేదన్నారు. గెలుపోటములు తెదేపాకు కొత్త కాదని.. కార్యకర్తలే పార్టీకి పెట్టని కోట అని వ్యాఖ్యానించారు. బడుగు బలహీన వర్గాల ప్రజలపై వైకాపా దౌర్జన్యకాండను సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వైకాపా బాధిత ప్రజలకు తెదేపా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
'బెదిరించి పుర ఎన్నికల్లో విజయం సాధించారు' - బెదిరించి పుర ఎన్నికల్లో విజయం సాధించారు న్యూస్
సంక్షేమ పథకాలు నిలిపేస్తామని బెదిరించి పుర పాలక ఎన్నికల్లో వైకాపా గెలుపొందిందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. అవినీతి డబ్బు, అధికార బలం, పోలీసుల అండతో వైకాపాకు విజయం సాధ్యమైందని దుయ్యబట్టారు.
!['బెదిరించి పుర ఎన్నికల్లో విజయం సాధించారు' బెదిరించి పుర ఎన్నికల్లో విజయం సాధించారు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11006962-1048-11006962-1615733297635.jpg)
బెదిరించి పుర ఎన్నికల్లో విజయం సాధించారు