ప్రలోభాలు, బెదిరింపులు చేయడం జస్టిస్ ఈశ్వరయ్యకు తగదని యనమల హితవు పలికారు. హైకోర్టు న్యాయమూర్తుల ప్రతిష్ఠ దెబ్బతీసేలా పిటిషన్లు దాఖలు చేయించడం తగదన్నారు. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయనే.. హైకోర్టు ఈశ్వరయ్యపై విచారణకు ఆదేశించిందని స్పష్టం చేశారు.
'ప్రలోభాలు, బెదిరింపులు జస్టిస్ ఈశ్వరయ్యకు తగవు' - జస్టిస్ ఈశ్వరయ్యపై యనమల కామెంట్స్
జస్టిస్ ఈశ్వరయ్య తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని తెదేపా నేత యనమల డిమాండ్ చేశారు. జడ్జి రామకృష్ణపై చేసిన ఆరోపణలు తీవ్రమైనవని.. ఫోన్ సంభాషణ ఆడియో తనదేనని ఈశ్వరయ్య ఒప్పుకున్నారని పేర్కొన్నారు.
yanamala on justice eshwaraiah