జగన్ రెడ్డి మరోసారి అంకెల గారడీ చేసి మహిళా లోకాన్ని మోసం చేస్తున్నారని యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. అది జండర్ బడ్జెట్ కాదు.. జండర్పై దౌర్జన్యాల బడ్జెట్ అని విమర్శించారు. అమ్మఒడి, ఆసరా, చేయూత ఇలా అన్నింటిలోనూ చివరకు దిశా చట్టంలో జరిగిన మోసంపై సమాధానం చెప్పాలన్నారు. ఒక్కో మహిళకు చేయూతలో 1.05 లక్షల ద్రోహం చేశారని యనమల మండిపడ్డారు. మద్య నిషేధం హామీతో ఓట్లు వేయించుకుని, జేట్యాక్స్ వసూళ్లు మోసం కాదా? అని నిలదీశారు. 20 నెలల పాలనలో 327 మంది మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరిగాయని తెలిపారు. దుర్గమ్మ దర్శనానికి వెళ్లే మహిళలపై దాడులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందుకే జండర్ బడ్జెట్ గారడీ చేస్తున్నారు: యనమల - ఏపీలో జెండర్ బడ్జెట్ న్యూస్
జగన్మోహన్ రెడ్డి మహిళలకు చేసిన తీరని ద్రోహాన్ని కప్పిపుచ్చేందుకే జండర్ బడ్జెట్ గారడీ చేస్తున్నారని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. సొంత చెల్లెకు న్యాయం చేయలేని వ్యక్తి మహిళాభ్యుదయమనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
yanamala on gender budget