శుభకృత్ నామ సంవత్సర ప్రజాపంచాంగంలో ఆర్ధిక సంక్షోభం ఖాయంగా కనిపిస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. కరోనాతో ఆర్ధికంగా కుదేలైన ప్రజలను జగన్ రెడ్డి ఆస్తిపన్ను, మరుగుదొడ్డి పన్ను, చెత్తపన్ను, విద్యుత్ ఛార్జీల బాదుడుతో దివాలా తీయిస్తున్నారని విమర్శించారు. పంచాయతీల నిధులు దారి మళ్లించి.. అభివృద్ధికి నోచుకోలేని స్థితిలో గ్రామ పంచాయతీలను ఉంచారని యనమల మండిపడ్డారు. గ్రామ పంచాయతీల అధికారాలను సర్పంచుల చేతిలో నుంచి లాగేయటం ఆర్టికల్ 73, 74 కు వ్యతిరేకమని అన్నారు. రాజధానిలో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగించేందుకు ఐదేళ్లు కావాలని ప్రభుత్వం అఫిడవిట్ వేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. 90 శాతం మౌలిక సుదుపాయాలు పూర్తయ్యాయని.. మిగిలినవి పూర్తిచేసి రైతులకు అప్పగించేందుకు 6 నెలలు సరిపోతుందని యనమల అభిప్రాయపడ్డారు.
ఉగాది పంచాంగంలో.. ఆర్థిక సంక్షోభం ఖాయంగా కనిపిస్తోంది: యనమల - యనమల న్యూస్
గ్రామ పంచాయతీల అధికారాలను సర్పంచుల చేతిలో నుంచి లాగేయటం ఆర్టికల్ 73, 74కు వ్యతిరేకమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. పంచాయతీల నిధులు దారి మళ్లించి.. అభివృద్ధికి నోచుకోలేని స్థితిలో గ్రామ పంచాయతీలను ఉంచారని ప్రభుత్వంపై మండిపడ్డారు. శుభకృత్ నామ సంవత్సర ప్రజాపంచాంగంలో ఆర్ధిక సంక్షోభం ఖాయంగా కనిపిస్తోందని తెలిపారు.
యనమల