ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నికల సంఘం తీరు ఏకపక్షం: మంత్రి యనమల - vijayawada

రాష్ట్రాలపై మోదీ పెత్తనం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని మంత్రి యనమల విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన ఎన్నికల సంఘ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

మంత్రి యనమల

By

Published : Mar 30, 2019, 2:03 PM IST

ప్రజాస్వామ్యాన్ని రక్షించడం ఎన్నికల సంఘం బాధ్యతని మంత్రి యనమల రామకృష్ణుడు విజయవాడలోగుర్తు చేశారు. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహించి...రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 22 పార్టీలు ఇచ్చిన వినతులుబుట్టదాఖలు చేస్తూ...ఇటీవల 3 అంశాల్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. ఓట్ల తొలగింపుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో 25 లక్షల ఓట్లు తొలగించారని అధికారులే తెలిపారని గుర్త చేశారు. లక్షల సంఖ్యలో ఫారం-7 దరఖాస్తులు వస్తే ఏం చేశారని అసహనం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details