రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది డెమోక్రసీ కాదని.. క్లిప్టోక్రసీ అని తెదేపా నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఏడాది పాలనపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యేలే అందుకు సాక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల్లో వ్యతిరేకత చూసే జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారన్నారు. 'అభివృద్ధి నిల్-అవినీతి ఫుల్' అని తెదేపా ఎప్పటినుంచో చెబుతోందన్నారు. ఏడాదిలో రూపాయి అభివృద్ధి చేయలేదని వైకాపా ఎమ్మెల్యేలే చెప్పారని యనమల గుర్తు చేశారు.
ఏడాదిలో జగన్ తెచ్చింది మాఫియా రాజ్యమే: యనమల - జగన్పై వైసీపీ ఎమ్మెల్యేల కామెంట్స్
ఏడాదిలో ముఖ్యమంత్రి జగన్ తెచ్చింది మాఫియా రాజ్యమేనని తెదేపా నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఏడాదిలో రూపాయి అభివృద్ధి జరగలేదని వైకాపా ఎమ్మెల్యేలే చెప్పారని పేర్కొన్నారు.
![ఏడాదిలో జగన్ తెచ్చింది మాఫియా రాజ్యమే: యనమల yanamala fires on 1 year of jagan governence](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7524581-245-7524581-1591598001632.jpg)
yanamala fires on 1 year of jagan governence