గత రెండేళ్లలో ప్రభుత్వం తెచ్చిన అప్పులు, పెంచిన పన్నులు వైకాపా నేతల దుబారాకు ఆహుతయ్యాయని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి వైకాపా నేతల దుబారానే కారణమని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన 10 లక్షల కోట్ల పెట్టుబడులు జగన్ ప్రభుత్వ బెదిరింపు ధోరణి వల్ల పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయని ఆక్షేపించారు. పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోవటం సంక్షోభానికి మరో కారణమని వ్యాఖ్యనించారు.
అమరావతిలో 2 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తిని నిరర్ధకం చేశారని యనమల మండిపడ్డారు. విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటా సాధించలేకపోయారని విమర్శించారు. కేసుల మాఫీ కోసం రాష్ట్ర హక్కులు తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.